తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు

గోవాలో కొవిడ్‌ చికిత్సకు కేటాయించిన ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆస్పత్రి సిబ్బంది యథావిధిగా కొనసాగుతారని, నియంత్రణ మాత్రమే ప్రభుత్వానిదని స్పష్టం చేసింది.

By

Published : May 15, 2021, 9:12 PM IST

goa cm, pramod savanth
ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొవిడ్‌ చికిత్సకు కేటాయించిన ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఆస్పత్రులన్నీ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు.

ఈ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రమోద్​ సావంత్​ స్పష్టం చేశారు. సిబ్బంది యథావిధిగా కొనసాగుతారని, నియంత్రణ మాత్రమే ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ప్రతి ఆస్పత్రిని ఒక ప్రభుత్వ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. కొవిడ్‌ బాధితుల కోసం 50 శాతం పడకలు కేటాయించాలన్న నిబంధనను అమలు చేయని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details