రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి ఆహ్వానించిన టెండర్లను రద్దు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పనులను నిలిపివేసింది. కరోనా కట్టడిపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది.
నయా రాయ్‌పుర్‌లో నిర్మించ తలపెట్టిన గవర్నర్ హౌస్, అసెంబ్లీ హౌస్, ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారుల నివాసాలు, న్యూ సర్క్యూట్ హౌస్ పనులు నిలిపివేసినట్లు ఓ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుల పనులకు 2019 నవంబర్ 25న భూమి పూజ చేశారు.
" ప్రజలే మా తొలి ప్రాధాన్యం. కరోనా ప్రారంభానికి ముందు అసెంబ్లీ భవనం, రాజ్ భవన్, సీఎం నివాసం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆయా ప్రాజెక్టులను నిలిపివేస్తున్నాం. "