దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తిపై(Covid New Variant in India) జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం(ఇన్సాకాగ్) కీలక ప్రకటన చేసింది. భారత్‌లో ఏవై.4.2 వ్యాప్తి 0.1 శాతం కంటే తక్కువ ఉందని.. ఆందోళన చెందాల్సినంత వ్యాప్తి లేదని స్పష్టం చేసింది.
"ప్రస్తుతం దేశంలో ఏవై.4.2 వ్యాప్తి చెందుతుందన్న ఆధారాలు లేవు. భారత్‌లో ఇప్పటికీ డెల్టా వేరియంట్ మాత్రమే ఆందోళనకరంగా ఉంది. వేరే వేరియంట్లు ఆందోళనకరంగా లేవు."
--ఇన్సాకాగ్
డెల్టా వేరియంట్ మొదటగా అక్టోబరులో వ్యాప్తి చెందింది. దీంతో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రబలింది. ఏప్రిల్, మేలో కేసుల సంఖ్య తారస్థాయికి చేరింది.
జీనోమ్ వేరియంట్లపై పర్యవేక్షించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం(ఇన్సాకాగ్)ను 2020 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది.
ఇతర రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- కేరళలో కొత్తగా 7,124 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 201 మంది మరణించారు. మరో 7,488 మంది వైరస్‌నుంచి కోలుకున్నారు. బంగాల్లో కొత్తగా 723 మందికి వైరస్ సోకింది. 11 మంది మృతిచెందారు.
- మహారాష్ట్రలో కొత్తగా 892 కేసులు నమోదయ్యాయి. 16 మంది వైరస్‌తో మరణించారు.
- కర్ణాటకలో తాజాగా 239 కేసులు నమోదు అయ్యాయి. మరో ఐదుగురు వైరస్ బారినపడి మరణించారు.
- ఒడిశాలో మరో 318 మందికి వైరస్ సోకింది. మరో ముగ్గురు మహమ్మారి కారణంగా మృతి చెందారు.
Corona cases in India: దేశంలో కొత్తగా 10,853 కరోనా కేసులు