తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవాగ్జిన్​తో.. లక్షణాలున్న కరోనా నుంచి 50 శాతం రక్షణ! - covaxin efficacy data

భారత్ బయోటెక్ (Bharat biotech covaxin) అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ రెండో దశ మహమ్మారి విజృంభణ సమయంలో మరణాలను గణనీయంగా తగ్గించినట్లు తేలింది. ఈ మేరకు కొవాగ్జిన్‌ సమర్థతను గుర్తిస్తూ 'ది లాన్సెట్ జర్నల్‌' (covaxin the lancet) ఓ అధ్యయనాన్ని వెలువరించింది. వ్యక్తి కరోనా బారిన పడకుండా కొవాగ్జిన్ (covaxin news) 50 శాతం రక్షణ కల్పించినట్లు ఓ కథనాన్ని ప్రచురించింది.

covaxin
కొవాగ్జిన్​

By

Published : Nov 25, 2021, 7:29 AM IST

లక్షణాలు బయటకు కనిపించే స్థాయిలో (సింప్టమాటిక్‌) కొవిడ్‌ బారిన పడకుండా రక్షించడంలో కొవాగ్జిన్‌ టీకా 50% సమర్థతతో(covaxin efficacy data) పనిచేస్తోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి మే 15 వరకు మహమ్మారి రెండో ఉద్ధృతి తీవ్రంగా ఉన్న అత్యంత సంక్లిష్ట సమయంలో పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దిల్లీ ఎయిమ్స్‌లో 2,714 మంది ఆరోగ్య సిబ్బంది పరిస్థితిని పరిశీలించారు.

వారిలో 1,617 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారంతా కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్నవారే. రెండు డోసులూ తీసుకున్న 14 రోజుల తర్వాత.. సిమ్టమాటిక్‌ కొవిడ్‌ బారిన పడకుండా ఆ టీకా 50% సమర్థతతో రక్షణ కల్పిస్తోందని పరిశోధకులు నిర్ధరించారు. నిజానికి- లక్షణాలు కనిపించే స్థాయిలో మహమ్మారి బారిన పడకుండా కొవాగ్జిన్‌ (covaxin side effects) 77.8% ప్రభావవంతంగా రక్షణ కల్పిస్తుందని గతంలో ఓ అధ్యయనంలో తేలింది. దీనిపై పరిశోధకులు స్పందిస్తూ.. కొవిడ్‌ రెండో ఉద్ధృతి ముమ్మరంగా ఉన్న సమయంలో తాము తాజా పరిశోధన చేపట్టినట్లు తెలిపారు.

అత్యంత వేగంగా వ్యాప్తి చెందే డెల్టా రకం వైరస్‌ (delta variant covaxin) అప్పట్లో తీవ్రస్థాయిలో విజృంభించిందని పేర్కొన్నారు. సాధారణ ప్రజలతో పోలిస్తే ఆసుపత్రి సిబ్బంది కొవిడ్‌ బారిన పడే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్నీ గుర్తుచేశారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో చేసిన అధ్యయనంలో టీకా సమర్థత కాస్త తక్కువగా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదని వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details