భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా కరోనా మ్యుటేషన్లపై సమర్థంగా పని చేస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి- ఐసీఎంఆర్ వెల్లడించింది.
సార్స్‌కోవ్-2 సహా కొత్తగా వచ్చిన మ్యుటెంట్ రకాన్ని కూడా అడ్డుకుంటోందని పేర్కొంది. యూకే, బ్రెజిల్ వేరియంట్లను కొవాగ్జిన్ సమర్థంగా నిలువరించినట్లు పేర్కొంది. భారత్‌లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న డబుల్ మ్యుటెంట్‌పైనా కొవాగ్జిన్ మెరుగైన పనితీరు కనబర్చిందని ఐసీఎంఆర్ ట్విట్టర్‌లో పేర్కొంది.