బెయిల్ మంజూరు ముందు నిందితుని నేర చరిత్రను పరిశీలించాల్సి ఉందని ఓ కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court bail order) వ్యాఖ్యానించింది. హత్య, క్రిమినల్ కుట్ర కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తికి పంజాబ్-హరియాణా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని తిరస్కరిస్తూ పై వ్యాఖ్య చేసింది.
'నేర చరిత్ర చూసిన తర్వాతే నిందితునికి బెయిల్' - సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు విధానం
నిందితుడి నేర చరిత్రను పరిశీలించిన తర్వాతే బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఆరోపణల తీవ్రతతో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని పేర్కొంది.
సుప్రీంకోర్టు
నేరారోపణల తీవ్రత, లభ్యమయ్యే సాక్ష్యాలు, దర్యాప్తును నిందితుడు ప్రభావితం చేసే ప్రమాదం, గతంలో అతడు పాల్పడ్డ నేరాలు తదితరాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ((Supreme Court) తెలిపింది.
ఇదీ చదవండి: