అసలే కరోనా. ఆక్సిజన్ అందక పలు చోట్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ ఎండాకాలం ఉక్కపోత. ఇది చూసి చలించిన ఓ నవ జంట.. తమ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ఆస్పత్రికి 100 ఎలక్ట్రిక్ ఫ్యాన్లు అందించింది.
తమిళనాడు కోయంబత్తూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల & ఈఎస్ఐ ఆస్పత్రికి వ్యాక్సిన్ తీసుకునేందుకు వెళ్లిన ఆ జంట.. కరోనా బాధితుల దృశ్యాలు చూసి సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇంకా అక్కడ ఫ్యాన్లు కూడా లేవని తెలుసుకొని.. అనుకున్నదే తడవుగా బంగారాన్ని కుదువపెట్టి రూ. 2 లక్షలతో విద్యుత్ ఫ్యాన్లు కొనుగోలు చేశారు. ఆస్పత్రి యాజమాన్యానికి అందజేశారు.