పెళ్లి కోసం శుభలేఖలతో ఆహ్వానం పలుకుతుంటాం. సాధారణంగా అవి దేవుళ్ల బొమ్మలతో ఉంటాయి. కానీ పాస్‌పోర్ట్‌లాగా శుభలేఖలు తయారు చేసి ఉండటాన్ని ఎప్పుడైనా చూశారా? కర్ణాటకలోని అనగోళకు చెందిన ధర్మరాజ అనే యువకుడు.. పాస్‌పోర్టును పోలినట్లు ఉండే శుభలేఖను తయారు చేయించి, బంధువులకు స్నేహితులకు తన పెళ్లికి ఆహ్వానం పలికాడు.
"ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాము. నా భార్యతో కలిసి చాలా రోజులు ఆలోచించాను. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఏదైనా కొత్తగా చేయాలి అనిపించింది. ఆధార్, పాన్‌కార్డ్ వంటి మోడల్స్‌లో ఇప్పటికే వెడ్డింగ్ కార్డులు వచ్చాయి. అదే విధంగా పాస్పోర్టుతో వెడ్డింగ్ కార్డు చేయాలనుకున్నాం. ఇందుకోసం బెళగావి, హుబ్లీ తిరిగాము. బోర్డింగ్ పాస్, పాస్‌పోర్ట్, టికెట్ మోడల్‌తో ఆహ్వాన పత్రిక ఉంటుంది."