Couple injured in Lohardaga: ఝార్ఖండ్ లోహర్దగా జిల్లాలో యువకుడు, యువతి ఒకరిపై ఒకరు హత్యయత్నానికి పాల్పడ్డారు. ప్రేమించుకున్నాక పెళ్లి విషయంలో తలెత్తిన వివాదంతో ఒకరి గొంతు ఒకరు కోసుకున్నారు. పరిస్థితి విషమించడం వల్ల స్థానికులు లోహర్దగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఫేస్బుక్లో లవ్.. కులం వేరని పెళ్లికి నో.. గొడవపడి గొంతు కోసుకున్న ప్రేమికులు - Couple injure news jarkhand
Couple injured in Lohardaga: వారిద్దరు ఏడాదిన్నర కింద ఫేస్బుక్లో కలిశారు. పెళ్లి చేసుకుందామని దరఖాస్తు తెస్తే కులం వేరని యువతి తిరస్కరించింది. దీంతో ఇద్దరి మధ్యలో తలెత్తిన వివాదంతో ఒకరిపై మరొకరు హత్యకు యత్నించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది.
ఝార్ఖండ్ రాంచీ జిల్లాలోని ఇత్కీ బజార్‌కు చెందిన శుభమ్ బైతాకు బొకారో జిల్లాలోని బలిదహ్కు చెందిన అమ్మాయి ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. ఏడాదిన్నరగా ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని కోరాడు యువకుడు. లోహర్దగాలోని తన సోదరి నివాసానికి వచ్చిన యువతిని కలిశాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి కోరాడు. కోర్టు వివాహ దరఖాస్తును తీసుకువచ్చి సంతకం చేయమని యువతిని కోరాడు. అయితే అతను వేరే కులానికి చెందిన వ్యక్తి కావడం వల్ల పెళ్లికి నిరాకరించింది యువతి. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆమె గొంతు కోశాడు. అనంతరం అతడు కూడా గొంతు కోసుకున్నాడు. కాగా యువతే కత్తితో తన గొంతు కోసి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిందని యువకుడు ఆరోపిస్తున్నాడు.
ఇదీ చదవండి:కులాంతర వివాహం.. యువకుడి హత్య.. యువతి తల్లిని చంపి ప్రతీకారం!