దేశంలోనే తొలి ఎయిర్ కండీషన్డ్(ఏసీ) రైల్వే స్టేషన్ త్వరలోనే బెంగళూరులో ప్రారంభంకానుంది. ఈ రైల్వే టెర్మినల్‌కు ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు పెట్టినట్లు కేంద్రమంత్రి పియూష్ గోయల్ శనివారం వెల్లడించారు.
ఈ రైల్వే స్టేషన్ బయప్పనహళ్లి ప్రాంతంలో ఉంది. 2015-16లో దీనికి ఏసీ టెర్మినల్ మంజూరు చేశారు. రూ.314 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీనిని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదాపడింది.
4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంతో రోజుకు 50 వేల మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ స్టేషన్ సొంతం. ఇక్కడున్న ఏడు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రోజులు 50 రైళ్లు నడుస్తాయని అధికారులు చెప్పారు.