Coronavirus Update: భారత్లో కరోనా కలవరం కొనసాగుతోంది. స్వల్పంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 3,275 కేసులు నమోదయ్యాయి. మరో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 3,010 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.74గా ఉంది. మొత్తం కొవిడ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కరోనా కేసులు: 4,30,91,393
- మొత్తం మరణాలు: 523975
- యాక్టివ్ కేసులు: 19,719
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,47,699
వ్యాక్సిన్ తీసుకునేందుకు పెద్దఎత్తున జనం ముందుకొస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 13 లక్షల 98 వేల 710 మందికి టీకా అందించింది కేంద్రం. మొత్తంగా ఇప్పటివరకు 1,89,63,30,362 డోసుల టీకా పంపిణీ చేసింది. బుధవారం 4,23,430 మందికి కరోనా పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 83.93 కోట్లు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం కరోనా కేసులు 51 కోట్ల 53 లక్షల 27 వేలకు చేరాయి. మరణాలు 62 లక్షల 69 వేలు దాటాయి.
- జర్మనీలో అత్యధికంగా ఒక్కరోజే లక్షా 66 వేలకుపైగా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 222 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో బుధవారం దాదాపు 50 వేల మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 72 మంది చనిపోయారు.
- అమెరికాలో 71 వేల కొత్త కేసులు, 305 మరణాలు నమోదయ్యాయి.
- ఫ్రాన్స్, ఇటలీలో 47 వేల చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి.
- ఇవీ చూడండి:'లౌడ్స్పీకర్ల'పై దుమారం.. మహారాష్ట్రలో టెన్షన్ టెన్షన్
36 అంగుళాల వరుడు.. 34 అంగుళాల వధువు.. ఘనంగా పెళ్లి