తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 19,078 కేసులు, 224 మరణాలు - కొవిడ్​-19 వైరస్​

దేశవ్యాప్తంగా కొత్తగా 19,078 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 3 లక్షల 5 వేలు దాటింది. దేశంలోని 5 రాష్ట్రాల్లోనే 62 శాతం యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

corona cases
కరోనా కేసులు

By

Published : Jan 2, 2021, 9:45 AM IST

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 20 వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. శుక్రవారం నుంచి శనివారం ఉదయానికి కొత్తగా 19,078 కేసులు నమోదయ్యాయి. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 22,926 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,03,05,788
  • క్రియాశీల కేసులు: 2,50,183
  • కోలుకున్నవారు: 99,06,387
  • మరణాలు: 1,49,218

5 రాష్ట్రాల్లోనే 62 శాతం యాక్టివ్​ కేసులు

దేశంలో కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లోనే 62 శాతం క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.08 శాతం, మరణాల రేటు 1.45 శాతం, యాక్టివ్​ కేసులు 2.47 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

కరోనా యాక్టివ్​ కేసుల వివరాలు

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 8.5కోట్లకు చేరువలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details