కర్ణాటక బెళగావి జిల్లా భవనసౌందట్టి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
మూడు రోజుల క్రితం అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి తొలుత శుక్రవారం రోజున నిర్వహించిన పరీక్షల్లో ఆ కుటుంబంలోని ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా మరో 14 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ కావడం కలకలం రేపుతోంది.