దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గముఖం పడుతోన్న వేళ పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళకరంగా మారింది. తమిళనాడులో 34,285 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు మరో 468 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కేరళలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 29,803 కేసులు నమోదయ్యాయి. 177 మంది చనిపోయారు.
- మహారాష్ట్రలో మరోసారి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 24,136 మందికి వ్యాధి సోకింది. మరో 601 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో కొత్తగా 22,758 వైరస్ కేసులు బయటపడ్డాయి. 588 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటికీ పాజిటివిటీ రేటు 21.13 శాతంగా ఉంది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 3,957 కరోనా కేసులు వెలుగుచూశాయి. 163 మంది చనిపోయారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 3,404 మందికి కరోనా సోకింది. మరో 105 మంది కొవిడ్‌కు బలైయ్యారు.
- దిల్లీలో మంగళవారం మరో 156 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 1,568 మంది కరోనా బారినపడ్డారు.
20 కోట్లు డోసులు..