Corona Cases in India: దేశంలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,383 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 20 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,58,425
- మరణాలు: 5,28,449
- యాక్టివ్ కేసులు: 45,281
- రికవరీలు: 4,39,84,695
Vaccination In India :
దేశంలో గురువారం 14,91,017 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 217.26 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,187 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,21,809 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,170 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,90,65,131కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,36,520 మంది మరణించారు. మరో 5,85,275 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,89,34,274కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా61,478 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 120మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 53,457 కేసులు వెలుగుచూశాయి. మరో 106 మంది మరణించారు.
- జర్మనీలో 50,800 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 93 మంది మృతి చెందారు.
- తైవాన్‌లో 42,470 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 38,598 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 222 మంది మృతి చెందారు.
ఇవీ చదవండి:నదిలో బోల్తా పడ్డ స్కూల్ విద్యార్థుల బోటు.. ఒక్కసారిగా 25 మంది పిల్లలు!
అమ్మవారి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడికి రూ.60 వేలు జరిమానా!