Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,379 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7కు పెరిగింది. యాక్టివ్ కేసులు 0.11 శాతానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,72,241
- క్రియాశీల కేసులు: 50,594
- మొత్తం మరణాలు: 5,28,030
- కోలుకున్నవారు: 4,38,93,590
Vaccination In India :
దేశంలో మంగళవారం 18,81,319 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 213.91 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,21,917 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 486,032 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,413 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 610,613,899 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,506,895 మంది మరణించారు. మంగళవారం మరో 753,584 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 588,727,760కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 84,295 కేసులు వెలుగుచూశాయి. మరో 239 మందికిపైగా మరణించారు.
- జర్మనీలో 46,495 కొవిడ్ కేసులు, 120 మరణాలు నమోదయ్యాయి.
- రష్యాలో 38,500 కొత్త కేసులు, 95 మరణాలు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియా, అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్‌లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి
ఇవీ చదవండి:అకస్మాత్తుగా రోగికి గుండెపోటు.. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన డాక్టర్.. వీడియో వైరల్
గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠ్మానరణం