Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,858 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 18 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,735 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,39,046
- మరణాలు: 5,28,355
- యాక్టివ్ కేసులు:48,027
- రికవరీలు:4,39,62,664
Vaccination In India :దేశంలో ఆదివారం 13,59,361 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,16,70,14,127 కోట్లకు చేరింది. ఒక్కరోజే 1,75,935 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 2,86,688 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 549 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,71,79,605 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,30,741 మంది మరణించారు. మరో 4,22,781 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,67,28,090 కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 69,731 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 139 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో 56,751 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 101మంది మృతి చెందారు.
- తైవాన్‌లో 39,569 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 39 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో కొత్తగా 34,764 కేసులు వెలుగుచూశాయి. మరో 46 మంది మరణించారు.
ఇవీ చదవండి:కళ్లు ఆర్పిన హనుమంతుడు.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం!
సిటీ బస్సులో భారీగా మంటలు.. లోపల 12 మంది ప్రయాణికులు.. చివరకు..