దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 46,617 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ నుంచి 59,384 మంది కోలుకోగా.. 853 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.01 శాతంగా నమోదైంది.
- మొత్తం కేసులు : 3,04,58,251
- మొత్తం మరణాలు : 4,00,312
- కోలుకున్నావారు : 2,95,48,302
- యాక్టివ్ కేసులు : 5,09,637
మొత్తం టెస్టులు..
దేశంలో ఇప్పటివరకు 41,42,51,520 కరోనా పరీక్షలు జరిగాయి. గురువారం.. 18,80,026 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ప్రత్యేక బృందాలు..
కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు.. కేంద్రం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు పర్యటించనున్నాయి. కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, మణిపుర్ రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల ఎక్కువగా ఉన్నాయి. కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు ఈ బృందాలు సహకారం అందిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
వ్యాక్సినేషన్..
రాష్ట్రాలకు మరో మూడు రోజుల్లో 44.9 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించనున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వృథా అయిన డోసులతో కలిపి మొత్తం 33.73 కోట్ల వ్యాక్సిన్ డోసులను కేంద్రం అందించిందని స్పష్టం చేసింది.
దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ సంఖ్య 34 కోట్లు దాటిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. 18-44 ఏళ్ల మధ్య వయసు గల 9,41,03,985 మంది తొలి డోసు అందుకున్నారని.. 22,73,477 రెండో డోసు తీసుకున్నారని వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 42,63,123 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
ఇదీ చదవండి :టీకా తీసుకున్న కరోనా రోగుల్లో వైరల్ లోడు తక్కువే!