Covid Cases In India: భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 2,539 మందికి వైరస్ సోకింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,491 వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు: 4,30,01,477
- మొత్తం మరణాలు: 5,16,132
- యాక్టివ్ కేసులు: 30,799
- కోలుకున్నవారు: 4,24,54,546
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం మరో 17,86,478 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,80,24,147కు పెరిగింది.