దేశంలో కరోనా కేసుల సంఖ్య(Corona cases in India) భారీగా తగ్గింది. ఒక్కరోజులో 12 వేల 830 మంది వైరస్ బారినపడ్డారు. మరో 446 మంది కొవిడ్‌కు(Corona cases in India) బలయ్యారు.
ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 7,427 కేసులు, 62 మరణాలు ఉన్నాయి.
యాక్టివ్ కేసులు (Coronavirus update) 247 రోజుల కనిష్ఠానికి చేరాయి.
రికవరీ రేటు 98.20 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక శాతం కంటే చాలా దిగువకు(0.46%) పడిపోయింది.
- మొత్తం కేసులు: 3,42,73,300
- మొత్తం మరణాలు: 4,58,186
- యాక్టివ్ కేసులు: 1,59,272
- మొత్తం కోలుకున్నవారు: 3,36,55,842
మొత్తం టెస్టులు..
దేశవ్యాప్తంగా శనివారం 11 లక్షలకుపైగా కరోనా టెస్టులు(Corona cases in India) నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 60 కోట్ల 83 లక్షలు దాటింది.
వ్యాక్సినేషన్..
భారత్‌లో టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం మరో 68,04,806 డోసుల వ్యాక్సిన్ అందించగా.. మొత్తం ఇప్పటివరకు 1,06,14,40,335 డోసుల టీకా పంపిణీ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..
ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 3,83,922 మంది కరోనా వైరస్ (Coronavirus update) బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 5,973 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,47,116,691కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,010,089కు పెరిగింది.
- రష్యాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. 40 వేల కేసులు నమోదుకాగా.. 1160 మంది మరణించారు.
- బ్రిటన్‌లో ఒక్కరోజే 41 వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. 166 మంది చనిపోయారు.
- అమెరికాలో కొత్తగా 26 వేల మందికి వైరస్ సోకగా.. మరో 350 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:అక్కడ 50 మందిలో ఒకరికి కరోనా..!