Corona Cases In India: దేశంలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోనూ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతోందని వెల్లడించింది. కేరళ, మిజోరాంలో మాత్రం వైరస్ ప్రభావం ఇంకా పెరుగుతోందని స్పష్టం చేసింది. దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది.
కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మూడో దశలో సరాసరి 44 ఏళ్ల వయసుగలవారు అత్యధికంగా వ్యాధిబారిన పడ్డారని వెల్లడించింది. గత కరోనా వేవ్‌లతో పోలిస్తే.. మందుల వాడకం బాగా తగ్గిందని తెలిపింది. 11 రాష్ట్రాల్లో పాఠశాలలు పూర్తిగా ప్రారంభమయ్యాయని పేర్కొంది. 16 రాష్ట్రాలు విద్యాసంస్థలను పాక్షికంగా తెరిచి ఉంచగా.. 9 రాష్ట్రాల్లో పూర్తిగా మూసివేశారని వెల్లడించింది.