తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎలక్ట్రిక్​ బైక్​గా పెట్రోల్​ బండి- ఖర్చు కూడా తక్కువే! - బౌన్స్​ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ టెక్నాలజీ

పెట్రోల్‌, డీజిల్​ ధరలు రోజురోజుకు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్‌ బైక్‌లు కొనుగోలు చేద్దామంటే.. వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో వినియోగదారుల కోసం రెట్రోఫిట్ అనే సాంకేతికతను తీసుకువచ్చింది.. బెంగళూరుకు చెందిన బౌన్స్ సంస్థ. కేవలం రూ.27 వేలకే పెట్రోల్‌ బైక్‌లను విద్యుత్ వాహనాలుగా మార్చేస్తోంది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం.

Electric bike in Cheapest cost
తక్కువ ధరలో విద్యుత్​ బైక్​

By

Published : Sep 29, 2021, 9:23 AM IST

పెట్రోల్​ బైక్​ను..​ విద్యుత్ బైక్​గా మార్చే టెక్నాలజీ

ద్విచక్రవాహనం.. ప్రతి ఇంట ఇప్పుడు తప్పనిసరి అవసరం. కానీ కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో బైక్‌లను ఉపయోగించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖర్చు తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వైపు మెుగ్గు చూపుద్దామంటే.. అందుబాటులో లేని ధరలు మరో సమస్య. ఈ రెండింటికి పరిష్కారం చూపుతూ రెట్రోఫిట్ అనే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.. బెంగళూరుకు చెందిన బౌన్స్ సంస్థ. పెట్రోల్‌తో నడిచే వాహనాలకు ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ను అమర్చుతోంది.

కేవలం రూ.27 వేల ఖర్చుతో పెట్రోల్ బైక్‌లను విద్యుత్ వాహనాలుగా మార్చటమే కాకుండా ఆర్​టీవో రిజిస్ట్రేషన్‌ సదుపాయం అందిస్తోంది.

ఈ-బైక్​గా మారిన పెట్రోల్ బండి

పెట్రోల్​తో పోలిస్తే భారీ ఆదా..

మార్కెట్‌లో విద్యుత్ వాహనాల కనీస ధర రూ.70 వేలు ఉండటం వల్ల.. ఆసక్తి ఉన్న వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన.. జుంక్ సంస్థ పెట్రోల్‌తో నడిచే ఇంజిన్‌ స్థానంలో లిథియం బ్యాటరీతో ప్రయాణించే నూతన సాంకేతికతను రూపొందించింది. ఈ సంస్థతో కలిసి బెంగళూరుకు చెందిన బౌన్స్.. వినియోగదారులకు తక్కువ ధరకే ఈ రెట్రోఫిట్ టెక్నాలజీని అందిస్తోంది.

ఐదారేళ్లు వాడిన పెట్రోల్ బైక్ సుమారు లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తే.. ఈ రెట్రోఫిట్ వాహనం ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 55 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బ్యాటరీని రీఛార్జ్‌ చేయటానికి రూ.85 ఖర్చు అవుతుండగా.. పెట్రోల్ వాహనంతో పోలిస్తే సగం డబ్బు ఆదా అవుతుందని వెల్లడించింది.

రానున్న రోజుల్లో అన్నిరకాల ద్విచక్రవాహనాలకు అనువైన విద్యుత్‌ ఇంజన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బౌన్స్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యుత్ వాహనాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. బ్యాటరీ రీఛార్జ్‌ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details