కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియుడ్ని కలిసేందుకు సాయం చేస్తానని నమ్మించి ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు పవన్ ధ్యావన్నవర్ను (26) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పవన్.. గోవింద రాజనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: తన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోవడం వల్ల జులై 25న ఇంటి నుంచి పారిపోయింది 17 ఏళ్ల మైనర్. తన ప్రియుడిని కలిసేందుకు బెంగళూరుకు బయలుదేరింది. బాధితురాల్ని విజయనగర్‌లోని ఓ పార్క్‌లో చూశాడు కానిస్టేబుల్ పవన్. ఆమెతో మాటలు కలిపాడు. ప్రియుడిని కలిసేందుకు చామరాజనగర్ జిల్లా యళందూర్ వెళ్లాలనుకున్నట్లు పవన్‌కు బాధితురాలు తెలిపింది.
ప్రియుడిని కలిసేందుకు సాయం చేస్తానని నమ్మించి కానిస్టేబుల్.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను చామరాజనగర్‌లో వదిలేశాడు. యళందూరు చేరుకున్న బాధితురాలు జరిగిన విషయమంతా తన ప్రియుడితో చెప్పింది. బాధితురాలు కెంపాపుర అగ్రహార పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
చెట్టుకు కట్టేసి..మహిళను చెట్టుకు కట్టేసి ఓ వ్యక్తి కర్రతో దాడి చేశాడు. మరో ఐదుగురు ఆమె చుట్టూ ఉన్నారు. ఈ వీడియో వైరలై.. జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ దృష్టికి చేరింది. దీంతో ఆమె వెంటనే నిందితుల్ని అరెస్టు చేయాలని, బాధితురాలికి వైద్యం చేయించాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బాంస్వాడాలో శనివారం జరిగింది. ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో బాధితురాలి భర్త, అత్తమామలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు మైనర్లు ఉన్నారని వెల్లడించారు.
బాలుడిపై లైంగిక వేధింపులు:14 ఏళ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేశాడు ఓ పాఠశాల ప్రిన్సిపల్. ఈ ఘటన గుజరాత్.. సూరత్‌లోని మున్సిపల్ పాఠశాలలో జరిగింది. నిందితుడు వ్యాస్‌ను పునా పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితమే విద్యాశాఖ ఉన్నతాధికారులు వ్యాస్‌ను సస్పెండ్ చేశారు. బాధితుడు 8వ తరగతి చదువుతున్నాడు. నిందితుడిపై జులై 19న పునా పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలుడ్ని లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోలు వ్యాస్ ఫోన్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:''ఐదేళ్లు చేస్తాం.. వెళ్లిపోతాం' అంటే కుదరదు'.. ఆ రాష్ట్రాలకు మోదీ వార్నింగ్!
ప్రేత కల్యాణం... 30ఏళ్ల క్రితం చనిపోయినవారికి పెళ్లి!