Rajiv Gandhi Assassination : రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశలున్నాట్లు సమాచారం. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దోషుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న విమర్శలతో ఇటీవలే కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల విడుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది.
రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదల.. సుప్రీంలో కాంగ్రెస్ సవాల్!
Rajiv Gandhi Assassination : రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు సమాచారం.
rajiv gandhi assassination
అయితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మెత్తం ఆరుగురు దోషులు రవిచంద్రన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్లను విడుదల చేయాలని సుప్రీంకోర్టు నవంబర్ 11న తీర్పు వెలువరించింది. కారాగారంలో దోషుల ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నందున శిక్ష తగ్గించాలని నిర్ణయించింది. దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Last Updated : Nov 21, 2022, 4:53 PM IST