Sonia Gandhi mother dead : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఈనెల 27న ఇటలీలోని తన ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు. మంగళవారం పౌలా మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా బుధవారం ఈ విషయం వెల్లడించారు.
సోనియా గాంధీ తల్లి మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పౌలా ఆత్మకు శాంతికి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. సోనియా కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సోనియా కుటుంబంలో తీవ్ర విషాదం- మోదీ సంతాపం - sonia gandhi family italy
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి పౌలా మైనో ఇటలీలో కన్నుమూశారు.
సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం
చివరి క్షణాల్లో తోడుగా..
పౌలా మైనో వయసు 90ఏళ్లు పైనే ఉంటుంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈనెల 23న ఇటలీ వెళ్లారు. కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా ఆమెకు తోడుగా వెళ్లారు.
Last Updated : Aug 31, 2022, 7:21 PM IST