తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ పోల్స్​ సీనియర్​ పరిశీలకుడిగా ఛత్తీస్​గఢ్​​ సీఎం..

ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​కు(cg cm bhupesh baghel) కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్​ అధిష్ఠానం. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల(up polls 2022) సీనియర్​ పరిశీలకుడిగా నియమించింది. సీఎం మార్పుపై(chhattisgarh cm change) జోరుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Cong names Chhattisgarh CM Bhupesh Baghel
ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​

By

Published : Oct 2, 2021, 9:35 PM IST

Updated : Oct 2, 2021, 9:59 PM IST

ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పుపై జోరుగా ప్రచారం(chhattisgarh cm change) జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం భూపేశ్‌ బఘేల్‌ను(cg cm bhupesh baghel) ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల సీనియర్‌ పరిశీలకుడిగా(up polls 2022) నియమించింది. అసోం శాసనసభ ఎన్నికల సమయంలో.. తన బృందంతో కాంగ్రెస్‌ శ్రేణులకు బూత్‌ స్థాయి శిక్షణ ఇవ్వటంలో కీలకపాత్ర పోషించిన బఘేల్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల అంశంపై ఇదివరకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, యూపీ ఎన్నికల బాధ్యురాలు ప్రియాంక గాంధీతో చర్చలు జరిపారు.

పార్టీ అధినేత్రి సోనియాగాంధీ(congress president).. ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల(UP Polls 2022) సీనియర్‌ పరిశీలకుడిగా బఘేల్‌ను నియమించినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

"ఉత్తర్​ ప్రదేశ్​ ఎన్నికలకు సీనియర్​ పరిశీలకుడిగా వ్యవహరించాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు ఆదేశించారు. అధిష్ఠానం అంచనాలను చేరుకునేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. 'పరిష్కారం అనేది మార్పు, దానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్​'"

- భూపేశ్​ బఘేల్​, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి.

కొత్త బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో బఘేల్​కు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు అజక్​ కుమార్​ లాలూ. ఆయన మార్గదర్శనంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఛత్తీస్​గఢ్​ కాంగ్రెస్​ యూనిట్​లో మార్పులు..

ఛత్తీస్​గఢ్​ కాంగ్రెస్​ యూనిట్​లోనూ పలు మార్పులు చేసింది అధిష్ఠానం. నాలుగు జిల్లాలకు కొత్త సారథులు, ఉపాధ్యక్షులు, జనరల్​ సెక్రటరీలు, సమాచార విభాగం అధ్యక్షులను నియమించింది.

జిల్లాలకు కొత్త సారథులను నియమించిన కాంగ్రెస్​

ఇదీ చూడండి:దిల్లీకి ఛత్తీస్​గఢ్​ ఎమ్మెల్యేల క్యూ.. సీఎం ఏమన్నారంటే?

Last Updated : Oct 2, 2021, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details