తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశాన్ని విభజించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు'

దేశ విభజనకు యత్నించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటోందని ఆరోపించారు కేంద్ర హోంత్రి అమిత్​ షా. అసోం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్​ చేతిలో అసోం సురక్షితంగా ఉండదని చెప్పారు. మరోవైపు బిశ్వంత బహిరంగ సభలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్.. భాజపా హయాంలో అసోంలో ఉగ్రవాదం తగ్గి.. శాంతి, సుస్థిరత నెలకొన్నాయని చెప్పారు.

Cong allying with outfits that wish to divide nation: Shah at rally in Assam
'దేశాన్ని విభజించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు'

By

Published : Mar 14, 2021, 5:41 PM IST

అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ సహా అగ్రనేత రాహుల్​ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. దేశ విభజనకు యత్నించే రాజకీయ పార్టీలతో కాంగ్రెస్​ పొత్తు పెట్టుకుంటోందని ధ్వజమెత్తారు. మార్గరీటాలో ఓ సభలో మాట్లాడుతూ ఓటుబ్యాంకు రాజకీయం చేయడం భాజపా విధానం కాదని చెప్పారు.

సభావేదికపై అమిత్​షా అభివాదం

"అసోం ప్రతినిధిగా 15 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి(మన్మోహన్​ సింగ్) ఉన్నా.. రాష్ట్రంలోకి అక్రమ వలసలను కాంగ్రెస్ కట్టడి చేయలేకపోయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది. అసోంలో బద్రుద్దీన్​ అజ్మల్​కు చెందిన ఏఐయూడీఎఫ్​తో, కేరళలో ముస్లిం లీగ్​తో, బంగాల్​లో ఇండియన్​ సెక్యూలర్​ ఫ్రంట్​తో ఆ పార్టీ జట్టుకట్టింది. అజ్మల్​ చేతిలో అసోం సురక్షితంగా ఉండదు. తమ సంక్షేమం గురించి ప్రధాని మోదీ, అజ్మల్​లో ఎవరు ఎక్కువ పట్టించుకుంటారో ప్రజలే నిర్ణయించుకోవాలి."

-అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

భాజపా అభివృద్ధిని నమ్ముకుంటే.. కాంగ్రెస్‌ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని టిన్‌సుకియా బహిరంగ సభలో ఆరోపించారు అమిత్​ షా.

షా సభకు హాజరైన జనం

"కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడికి వచ్చి వేర్వేరు జాతులు, వేర్వేరు వర్గాల గురించి మాట్లాడుతుంది. ప్రజల మధ్య భేదాభిప్రాయాలు, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. అది వారి రాజకీయ పద్ధతి. అలాంటి పద్ధతి కలిగి ఉన్నందుకు రాహుల్‌ గాంధీకి శుభాకాంక్షలు. కానీ మేం మాత్రం సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదంతో పని చేశాం."

-అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి

ఐదేళ్ల పాలనలో కజిరంగా జాతీయ పార్కు స్థలాన్ని, మత సంస్థల భూములను ఆక్రమించిన చొరబాటుదారులను భాజపా తరిమేసిందని అమిత్​ షా చెప్పారు. అసోంను ఆందోళన రహిత, ఉగ్రవాద రహితంగా మార్చి తన హామీని నెరవేర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అసోం శాంతి, అభివృద్ధిని అనుభూతి చెందుతోందని, చొరబాట్ల సమస్య పరిష్కారానికి మరో ఐదేళ్లు తమకు అవకాశం ఇవ్వాలని అమిత్​ షా కోరారు.

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్

శాంతి, అభివృద్ధికే ఓటు..

మరోవైపు బిశ్వంత బహిరంగసభలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్.. భాజపా హయాంలో ఉగ్రవాదం తగ్గి, శాంతి, సుస్థిరత నెలకొన్నాయని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని‌ తెలిపారు. అనేక ఉగ్రవాద సంస్థలు ఆయుధాలు వీడి శాంతిబాటలోకి వచ్చాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:కేరళలో 115 స్థానాల్లో భాజపా పోటీ

ABOUT THE AUTHOR

...view details