తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యాసిడ్​ దాడి బాధితులకు పరిహారం ఇవ్వరేం?' - rekha sharma

దేశంలో 1,273 మంది యాసిడ్​ దాడి బాధితుల్లో 799 మందికి పరిహారం అందలేదని ఎన్​సీడబ్ల్యూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పలు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నోడల్​ అధికారులతో వర్చువల్​ సమావేశంలో చర్చించింది.

NCW report
'యాసిడ్​ దాడి బాధితులకు పరిహారం ఇవ్వరేం?'

By

Published : Nov 22, 2020, 3:50 PM IST

దేశంలో నమోదైన 1,273 యాసిడ్​ దాడి కేసుల్లో 799 మందికి పరిహారం అందలేదని జాతీయ మహిళా కమిషన్ (ఎన్​సీడబ్ల్యూ) వెల్లడించింది. దీనిపై రాష్ట్రాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు 24 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో వర్చువల్​ సమావేశం ఏర్పాటు చేసింది ఎన్​సీడబ్ల్యూ. కమిషన్​కు సంబంధించిన మేనేజ్​మెంట్​ ఇన్ఫర్మేషన్ సిస్టమ్​ వెబ్​సైట్​లో నమోదైన యాసిడ్​ దాడి కేసులపై చర్చించింది.

బాధితులకు పరిహారం చెల్లించకపోవడంపై ఎన్​సీడబ్ల్యూ ఛైర్​ పర్సన్​ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో యాసిడ్​ దాడుల సంఖ్య ఒకలా ఉంటే... వెబ్​సైట్​లో నమోదవుతున్న వివరాలు మరోలా ఉన్నాయని ఆక్షేపించారు. యాసిడ్​ దాడుల జాబితాను తయారు చేసేందుకు అధికారులను నియమించని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడినట్లు తెలిపారు.

కమిషన్​ వెల్లడించిన అంశాలు...

  • మొత్తంగా 1,273 బాధితుల్లో 726 మందికి మాత్రమే రాష్ట్రాలు ఆరోగ్య సేవలు అందించాయి.
  • మహిళలకు రక్షణ కల్పించేందుకు రాష్టాలు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
  • యాసిడ్​ దాడులకు సంబంధించి పలు రాష్ట్రాల్లో/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభియోగ పత్రాలు ఆలస్యంగా దాఖలు చేస్తున్నారు. కొన్ని కేసుల వివరాల్లో తేదీలు కూడా ఉండకపోవడం గమనార్హం.
  • యాసిడ్​ దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తును పోలీసు అధికారులు అశ్రద్ధ చేయకూడదని నోడల్​ అధికారులు హెచ్చరించాలి.

ఇదీ చదవండి:హద్దు మీరిన పాక్- బుద్ధి చెప్పిన భారత్

ABOUT THE AUTHOR

...view details