బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సఫ్లై అండ్ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్)లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ సంస్థ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా చిల్లర రూపంలో జీతాలు పొందుతున్నారు. దీనికి కారణం.. బెస్ట్‌కు వచ్చిన చిల్లరను తీసుకోవడానికి కొన్ని బ్యాంకులు నిరాకరించడమేనని ఆ సంస్థ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
బెస్ట్ సంస్థ దాదాపు 4 వేల బస్సులను నడపడమే కాకుండా.. 10 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరాను అందిస్తోంది. ప్రయాణికుల టికెట్లు, విద్యుత్తు వినియోగదారులు చెల్లించే బిల్లుల్లో అధికంగా చిల్లర ఉంటోంది. బ్యాంకులు ఆ చిల్లరను తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో చేసేది లేక 'బెస్ట్' తమ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు ఇస్తోందని అధికారులు వెల్లడించారు.