CNP ITI Jobs 2023 : నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ (CNP) 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సూపర్వైజర్, ఆర్టిస్ట్, టెక్నీషియన్ సహా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- జూనియర్ టెక్నీషియన్ - 112
- సూపర్వైజర్ (టీఓ ప్రింటింగ్) - 02
- సూపర్వైజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 01
- ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైనర్) - 01
- సెక్రటేరియల్ అసిస్టెంట్ - 01
- మొత్తం పోస్టులు - 117
విద్యార్హతలు
CNP Jobs Qualification :
- జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులు ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రికల్/ మెషినిస్ట్/ ఫిట్టర్/ ఎలక్ట్రానిక్స్/ ఎయిర్ కండిషనింగ్/ ప్రింటింగ్ ట్రేడ్ విభాగాల్లో క్వాలిఫై అయ్యుండాలి.
- ఆర్టిస్ట్ పోస్టులకు ఫైన్ ఆర్ట్స్/ విజువల్ ఆర్ట్స్ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేసుండాలి. గ్రాఫిక్స్‌లో వొకేషనల్ డిగ్రీ చేసినవారూ అర్హులే.
- సెక్రటేరియల్ అసిస్టెంట్, సూపర్ వైజర్ పోస్టులకు సంబంధించిన.. విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
వయోపరిమితి
CNP Jobs Age Limit :
- సూపర్వైజర్ పోస్టులకు.. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఆర్టిస్ట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు.. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం
CNP Jobs Selection Process :
- అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.
- సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు స్టెనోగ్రఫీ/టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.