భారతరత్న సీఎన్ఆర్ రావు బయోగ్రఫీని తాను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ. ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డా.అరవింద్ యాదవ్.. హిందీలో రచించిన ఈ పుస్తకాన్ని బెంగళూరులో దేవెగౌడ ఆవిష్కరించారు. సీఎన్ఆర్ రావు.. స్ట్రక్చరల్ కెమిస్ట్రీపై ఎంతో పరిశోధన చేసి ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీల డాక్టరేట్లు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్ట్ డి.పి సతీష్ కూడా హాజరయ్యారు. రచయితకు అభినందనలు తెలియజేశారు.
తెలియని విషయాలతో..
సీఎన్ఆర్ రావు ఎంతగానో సహకరించి, జనబాహుళ్యానికి తన జీవిత విశేషాలను ఈ పుస్తకం కోసం చెప్పినట్టు రచయిత అరవింద్ వివరించారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు, విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆయన ఔన్నత్యాన్ని మరింతగా విశదీకరించేందుకు దోహదపడిందని వివరించారు. సీఎన్ఆర్ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను, చేదు జ్ఞాపకాలను తనతో పంచుకున్నారని చెప్పారు.