తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారా బూందీ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి - చిన్నారి మృతి

కారా బూందీ గొంతులో ఇరుక్కుని ఒకటోతరగతి చదువుతున్న చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన కేరళ తిరువనంతపురంలో జరిగింది. తమ ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందటంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

death after eating 'mixture'
చిన్నారి మృతి

By

Published : Jul 12, 2021, 4:25 PM IST

కేరళ తిరువనంతపురంలో విషాద ఘటన జరిగింది. కారా బూందీ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతిచెందింది. తిరువనంతపురం.. తిరిక్కన్నపురానికి చెందిన రాజేశ్, కవితల కుమార్తె.. నివేదిత ఒకటో తరగతి చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం కారాబూందీ తింటుండగా.. ఒక్కసారిగా బూందీ గొంతులో ఇరుక్కుంది.

దీంతో చిన్నారికి ఊపిరి ఆడలేదు. వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని శాంతివిల ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తమ ఒక్కగానొక్క చిన్నారి అకాల మరణంపై ఆ కుటుబం కన్నీటి పర్యంతం అయింది.

ఇదీ చదవండి :వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details