తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ లాటరీలో కనకవర్షం.. రూ.16కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి - క్రిస్మస్ బంపర్ లాటరీ టికెట్ 2023 ఫలితాలు

కేరళలో ఓ వ్యక్తికి రూ.16 కోట్ల లాటరీ తగిలింది. క్రిస్మస్-న్యూ ఇయర్​ బంపర్ లాటరీలో ఈ అదృష్టం వరించింది. మరో పది మంది రూ.కోటి చొప్పున, 20 మంది లక్ష రూపాయల చొప్పున గెలుచుకున్నారు.

christmas-new-year-bumper-2023-lottery-results-kerala
క్రిస్మస్ కొత్త సంవత్సరం బంపర్ లాటరీ టికెట్ 2023 ఫలితాలు

By

Published : Jan 19, 2023, 7:39 PM IST

కేరళలో ఓ వ్యక్తికి రూ.16 కోట్ల లాటరీ తగిలింది. క్రిస్మస్, న్యూ ఇయర్​ సందర్భంగా లాటరీ టిక్కెట్​ను కొన్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. క్రిస్మస్-న్యూ ఇయర్​ బంపర్​​ లాటరీ పేరుతో కేరళ లాటరీ డిపార్ట్​మెంట్​ ఈ టిక్కెట్లను అమ్మింది. తిరువనంతపురం జిల్లాలో ఈ టికెట్లను అమ్మింది లాటరీ డిపార్ట్​మెంట్​. ​కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఆధ్వర్యంలో ఈ లాటరీ డ్రాను తీశారు.

మధుసుదనన్ అనే లాటరీ షాపు నిర్వాహకుడు.. రూ.16 కోట్ల విన్నింగ్ టికెట్​ను విక్రయించాడు. అయితే, ఇది కొన్నది ఎవరన్నది ఇంకా తెలియలేదు. విజేత లాటరీ టికెట్ నంబర్​ XD 236433. క్రిస్మస్-న్యూ ఇయర్​ బంపర్​​ లాటరీ కేరళలలో రెండవ అతిపెద్ద లాటరీ. ఓనమ్​ బంపర్​ టికెట్​ ఆ రాష్ట్రంలో అతిపెద్ద లాటరీ టికెట్​. దాని విలువ రూ.25 కోట్లు.

తాజా డ్రాలో.. పది మందికి రెండో బహుమతి లభించింది. వీరికి ఒకొక్కరికి కోటి రూపాయల చొప్పున అందజేస్తారు. మరో 20 మందికి మూడో బహుమతి వరించింది. వీరికి ఒకొక్కరికి లక్ష రూపాయలు ఇస్తారు. ఈసారి బంపర్ డ్రాలో మొత్తం 32,43,908 మంది లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. లాటరీ టికెట్​ ధర రూ.400. గత సంవత్సరం క్రిస్మస్​-న్యూఇయర్​ బంపర్​.. మొదటి బహుమతి రూ.12 కోట్లుగా ఉండేది. అప్పుడు టికెట్​ 300గా ఉండేది. ఈ సంవత్సరం టికెట్​ ధర రూ.100 మేర పెంచి.. లాటరీ విలువ రూ.16 కోట్లకు మార్చారు.

ABOUT THE AUTHOR

...view details