కర్ణాటకకు చెందిన ఓ 77 ఏళ్లు వ్యాపారి మత సామరస్యాన్ని చాటుకున్నారు. క్రైస్తవుడైన గాబ్రియెల్ నజరెత్ ఉడుపి జిల్లా శిర్వాలోని తన ఇంటి సమీపంలో సొంత ఖర్చుతో సిద్ధి వినాయక ఆలయాన్ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆలయ నిర్మాణానికి రూ. 2 కోట్లు ఖర్చు అయ్యాయి. తన తల్లిదండ్రులు ఫాబియన్ సెబాస్టియన్ నజరెత్, సబీనా నజరెత్ స్మారకంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గాబ్రియెల్ వెల్లడించారు.
ముంబయిలో సుమారు 55 ఏళ్లు నివసించిన గాబ్రియెల్.. స్థానికంగా ఉన్న సిద్ధివినాయక స్వామి ఆలయాన్ని తరచూ సందర్శించేవారు. సిద్ధివినాయక స్వామి వల్లనే తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలిగానని చెప్పుకొచ్చారు. తాను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నా హిందూ మతం అంటే తనకు ఎంతో గౌరవమన్నారు.