రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా శంషాబాద్ ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో(Chinna Jeeyar Swamy) సమతామూర్తి విగ్రహాం(Statue of Equality) ఏర్పాటుకానుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్(Ramnath Kovind) కోవింద్‌ను చినజీయర్ స్వామి ఆహ్వనించారు. ఆయన వెంట మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు సైతం ఉన్నారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లకు సైత ఆహ్వానం అందింది.
వెయ్యి కోట్లతో..
సమతామూర్తి పంచలోహ విగ్రహం ఎత్తు 216 అడుగులు. మొత్తం 200 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ విగ్రహావిష్కరణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 35 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేయనున్నారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వర్‌రావు తదితరులు రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి విగ్రహ విశేషాలు, ఆ ప్రతిమ ఏర్పాటు వెనుకున్న కారణాలను వివరించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ఆహ్వానితులు తెలిపారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆహ్వానం పలికిన వీరు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వానం పలికారు. రామానుజాచార్య జీవిత విశేషాలు తదితర అంశాలను ఆయనకు సుమారు గంటపాటు వివరించారు.
సమాజంతా ఒక్కటనే సందేశం..