చైనా డ్రోన్ల వల్ల భద్రతా దళాలకు ముప్పు పరిణమించింది. ఈ వాణిజ్య డ్రోన్లు ఉగ్రవాదులకు ఆసరాగా నిలుస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముష్కర మూకలు వీటిని ఉపయోగించుకొని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ గుండా ఆయుధాలు, మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాయి.
శీతాకాలంలో జమ్ము కశ్మీర్లోని సరిహద్దు వెంట డ్రోన్ల ద్వారా ఆయుధాల అక్రమ రవాణా చేయడం అంత సులభం కాదు. శీతల గాలులు, పలు ప్రాంతాల్లో 40-50 అడుగుల మేర మంచు పేరుకుపోవడం వల్ల డ్రోన్ల ద్వారా వీటి రవాణా ఈ కాలంలో నిలిచిపోతుంది. కానీ, చైనా తయారు చేసిన డ్రోన్ల ద్వారా చలికాలంలోనూ ఎలాంటి అడ్డు లేకుండా వీరి నిర్వాకం కొనసాగుతోంది. మంచు కురిసినా వీరి పని ఆగకుండా ముందుకు సాగుతోంది.
ఇదీ చదవండి:డ్రోన్లతో పాక్ కుట్రలు- భారత సైన్యం అప్రమత్తం
కశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల వల్ల ముష్కర మూకలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరత ఏర్పడింది. అయితే, ఉగ్రవాదుల చొరబాట్లు, లాజిస్టిక్ అవసరాల కోసం డ్రోన్ల ద్వారా ఆయుధాలను, మాదకద్రవ్యాలను సరిహద్దు దాటించడం ఇటీవల తరచుగా జరుగుతోంది.
ఇదీ చదవండి:పాక్ డ్రోన్ కలకలం- నేలకూల్చిన భారత సైన్యం
హెక్సాకాఫ్టర్గా పిలిచే ఈ డ్రోన్లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఒకేసారి పలు ఆయుధాలను వీటి ద్వారా మోసుకెళ్లవచ్చు. కేజీల చొప్పున మాదకద్రవ్యాలను సరిహద్దు దాటించవచ్చు. దీంతోపాటు భారత బలగాలను గుర్తించేందుకు, రక్షణ వ్యవస్థలను పసిగట్టేందుకూ వీటిని వినియోగిస్తున్నారు ఉగ్రవాదులు. భారత్లోకి ప్రవేశించేందుకు ముష్కరులకు ఈ సమాచారం కీలకంగా మారుతోంది. అందువల్ల వీటిని ఉపయోగించేందుకు ఉగ్రవాదులు మొగ్గుచూపుతున్నారు.
కుట్రలు భగ్నం