Children Aadhaar: నవజాత శిశువులకు ఆధార్ కార్డు జారీ మరింత తేలిక కానుంది. పుట్టిన వెంటనే ఆస్పత్రుల్లోనే చిన్నారులకు ఆధార్ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు ఉడాయ్ సీఈఓ సౌరభ్ గార్గ్ ఈ విషయం వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
"అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదు. కేవలం వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తాం. ఐదేళ్లు పూర్తైన తర్వాత చిన్నారుల బయోమెట్రిక్ తీసుకుంటాం. ఇప్పటికే 99.7 శాతం మందికి (131 కోట్ల మంది) ఆధార్ కార్డు జారీ చేశామని, ఇక నవజాత శిశువుల ఆధార్ నమోదుకు కృషి చేస్తున్నాం. ఏటా 2-2.5 కోట్ల జననాలు జరుగుతున్నాయి. వారికి పుట్టిన వెంటనే ఆధార్ నంబర్ కేటాయించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం."
---సౌరభ్ గార్గ్, ఉడాయ్ సీఈఓ
ఆధార్‌తో రూ.2.25 లక్షల కోట్లు ఆదా