తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మతి స్థిమితంలేని 8ఏళ్ల చిన్నారిపై అత్యాచారం - చిన్నారిపై రేప్

Child Rape News: మతిస్థిమితం లేని ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. బాలికను అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

Maharashtra
child rape news

By

Published : Mar 21, 2022, 7:33 AM IST

Child Rape News: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమెను అపహరించి అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఏం జరిగిందంటే..?

నాగ్​పుర్​లోని ఇమాంబాదా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మతిస్థిమితం లేని ఎనిమిదేళ్ల చిన్నారిని తన ఇంటికి ఎత్తుకెళ్లాడు ఓ కిరాతకుడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

జరిగిన విషయాన్ని బాధితురాలు తన సోదరికి చెప్పగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి:పొలానికి వెళ్లిన బాలికపై.. మద్యం తాగించి గ్యాంగ్​రేప్​!

ABOUT THE AUTHOR

...view details