తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సుప్రీం న్యాయమూర్తుల నియామకంపై వార్తలు బాధాకరం'

సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంపై మీడియాలో వస్తున్న వార్తలు బాధాకరమని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఇంకా ఖరారు చేయకుండానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Chief Justice N V Ramana
సీజేఐ జస్టిస్ రమణ

By

Published : Aug 18, 2021, 1:36 PM IST

Updated : Aug 18, 2021, 1:53 PM IST

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం పేర్లు ఖరారు చేసిందని వస్తున్న వార్తలు బాధాకరమని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ అన్నారు. ఇది తనను తీవ్ర అసహనానికి గురి చేసిందని పేర్కొన్నారు. పేర్లను కొలీజియం ఖరారు చేయకముందే, ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందే ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. న్యాయవ్యవస్థ సమగ్రత, గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలని సూచించారు.

ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రచారం కారణంగా ఎంతో నైపుణ్యం వారు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందే అవకాశముందని సీజేఐ జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.

పదవీ విరమణ చేస్తున్న జస్టిస్​ నవీన్​ సిన్హా వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడుతూ సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పవిత్రమైందని, గౌరవంతో కూడుకున్నదని అన్నారు. మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ అసత్య ప్రచారానికి దూరంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలను సీజేఐ ప్రశంసించారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్ నేత శశి థరూర్​కు దిల్లీ కోర్టులో ఊరట

Last Updated : Aug 18, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details