తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెత్తురోడిన రహదారులు- ఒకే కుటుంబంలో 9 మంది మృతి - రాజస్థాన్​ రోడ్డు ప్రమాదం

రహదారులు ఆదివారం రక్తసిక్తంగా మారాయి. ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ ఏడాది వయసు చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్​లో జరిగిన మరో ఘటనలో నలుగురు మరణించారు.

road accident news
రోడ్డు ప్రమాదం

By

Published : Sep 19, 2021, 6:10 PM IST

Updated : Sep 19, 2021, 7:56 PM IST

ఛత్తీస్​గఢ్​ కోండాగావ్​ జిల్లాలో(Chhattisgarh raipur news) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటో రిక్షా, ఎస్​యూవీ ఢీకొన్న ఘటనలో(Road Accident) ఏడాది పాప సహా, ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు.

ఎలా జరిగిందంటే..

పందీత్​ గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. గోద్మా గ్రామంలో తమ బంధువు అంత్యక్రియలకు హాజరైన తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను.. బోర్​గావ్​ వద్ద ఓ ఎస్​యూవీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్​తో పాటు అందులోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని ఓ అధికారి తెలిపారు. మరొకరు ఆస్పత్రికి తరలించాక ప్రాణాలు కోల్పాయారని చెప్పారు.

జగ్​దల్​పుర్​ నుంచి ఎస్​యూవీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సదరు అధికారి తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. వారిలో ఏడాది చిన్నారి సహా నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్​యూవీ.. ఘటనాస్థలి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించామని వెల్లడించారు.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం అధికారులు తరలించారు. పరారైన ఎస్​యూవీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

నలుగురు మృతి..

మరోవైపు.. రాజస్థాన్​ హనుమాన్​గఢ్​ జిల్లాలో(Rajasthan Hanumangarh News) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Rajasthan Accident News Today) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కారు, ట్రక్కు ఢీకొనగా ఈ ఘటన జరిగింది.

రావత్​సర్​- హనుమాన్​ గఢ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులంతా 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారేనని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నడిరోడ్డుపై దారుణ హత్య.. బావను కత్తితో పొడిచి..

Last Updated : Sep 19, 2021, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details