ఛత్తీస్‌గఢ్‌లోని యాంటీ నక్సల్ ఆపరేషన్‌కు పేలవ ప్రణాళిక రచించారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం ఇష్టానుసారం జవాన్ల ప్రాణాలను బలిచేయొద్దని పేర్కొన్నారు. ఎలాంటి నిఘా వైఫల్యం లేనప్పుడు నక్సల్స్ వైపు కూడా సమానంగా ప్రాణనష్టం జరగడం పేలవ ప్రణాళిక, ఆపరేషన్ నిర్వహణ లోపానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ కుల్దీప్ సింగ్ నివేదికను ప్రస్తావిస్తూ సోమవారం ట్విట్టర్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.
'పేలవ ప్రణాళికే నక్సల్ దుశ్చర్యకు కారణం'
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన నక్సల్ ఆపరేషన్‌కు అధికారులు పేలవంగా ప్రణాళిక రచించారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నక్సల్స్ వైపు కూడా సమానంగా ప్రాణనష్టం జరగడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
బీజాపుర్, సుక్మా జిల్లాల సరిహద్దులో శనివారం జరిగిన ఈ ఘటనలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ గల్లంతయ్యారు.
ఇదీ చదవండి :అమర జవాన్లకు అమిత్ షా నివాళి