ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో దారుణానికి పాల్పడ్డారు మావోయిస్టులు. పెంటా గ్రామంలో ఇంట్లోకి చొరబడి ఓ జవానును హత్య చేశారు. అంతా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు నక్సలైట్లు.. జవానును పొట్టనపెట్టుకున్నారు.
" మేము నిద్రిస్తున్న సమయంలో ఐదుగురు ఇంట్లోకి వచ్చారు. ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పట్టుకున్నారు. మా ట్రాక్టర్ తాళాలు, ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత హత్య చేశారు. "