తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిర్ ​ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్​- కారణం ఇదే.. - భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్​లో అత్యవసర ల్యాండింగ్​

emergency landing news: రాంచీ నుంచి చెన్నై బయలుదేరిన ఎయిర్​ ఏషియా విమానం భువనేశ్వర్​లో అత్యవసర ల్యాండింగ్​ అయింది.

Chennai-bound flight makes emergency landing at Bhubaneswar airport
ప్రయాణికుడికి అస్వస్థత.. ఎయిర్​ఏసియా విమానం అత్యవసర ల్యాండింగ్​

By

Published : Jan 9, 2022, 9:54 PM IST

Updated : Jan 9, 2022, 10:43 PM IST

emergency landing news: ఝార్ఖండ్​ నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ​ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్​ అయ్యింది. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురైన కారణంతో.. ఒడిశా భువనేశ్వర్​లోని బిజు పట్నాయక్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్​ చేసినట్లు ఎయిర్​పోర్ట్​ వర్గాలు తెలిపాయి.

ఎయిర్ ఏషియాకు చెందిన ఐఏడీ 1631ఏ320 విమానం రాంచీ ఎయిర్​ పోర్ట్​ నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ క్రమంలో బసంత్​ కుమార్​ పాశ్వాన్​ అనే ప్యాసింజర్​ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో విమానాన్ని బిజు పట్నాయక్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి రీ రూట్​ చేసి అత్యవసర ల్యాండింగ్​ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 7 గంటల 26 నిమిషాల ప్రాంతంలో విమానం ల్యాండ్​ అయినట్లు పేర్కొన్నారు.

అనారోగ్యానికి గురైన వ్యక్తిని భువనేశ్వర్​లోని క్యాపిటల్​ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య- ఫేస్​బుక్​లో లైవ్

Last Updated : Jan 9, 2022, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details