Chattisgarh govt employees: గణతంత్ర వేడుకల వేళ ఉద్యోగులు, రైతులు, వేర్వేరు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పింది ఛత్తీస్‌గఢ్‌లోని భూపేశ్ బఘేల్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారంలో ఐదు రోజులు విధులకు హాజరైతే చాలని ప్రకటించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్ష్దాయీ పింఛను యోజన కోసం ప్రభుత్వం చెల్లించే వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది.
రైతులకు కూడా తీపి కబురు చెప్పింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. 2022-23 ఖరీఫ్ సీజన్ నుంచి.. పప్పు ధాన్యాలు అన్నింటినీ కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.