Char Dham Yatra 2022: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మంగళవారం తెరిచారు. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు. అనంతరం అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పూజారులు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సతీసమేతంగా గంగోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చార్‌ధామ్ యాత్ర షురూ.. అనుమతి కొంతమందికే
Char Dham Yatra 2022: ప్రముఖ పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి ఆలయాలను అధికారులు మంగళవారం తెరిచారు. అయితే చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు చార్‌ధామ్ యాత్ర నిలిచిపోగా ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారని ఉత్తరాఖండ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గంగోత్రికి రోజుకు 7వేల మందిని, యమునోత్రికి రోజుకు 4వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని ఈనెల 6న, బద్రినాథ్ ఆలయాన్ని ఈనెల 8న తెరవనున్నారు. కేదార్‌నాథ్ ఆలయ దర్శనానికి రోజుకు 12వేలు మందిని, బద్రినాథ్‌కు 15 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:సిమ్‌కార్డు రాకెట్ గుట్టు రట్టు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో చీటింగ్