తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి చన్నీ! ఆ ట్వీట్​కు​ అర్థం అదేనా? - Punjab assembly polls 2022

Punjab Congress CM candidate: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్​ పార్టీకి ఎంతో కీలకం. అయితే.. ఆ పార్టీకి అంతర్గత పోరు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో సిద్ధూ బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా.. అధిష్ఠానం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందా? కాంగ్రెస్​ తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో ముఖ్యమంత్రి చన్నీని అసలైన నాయకుడిగా చూపిస్తూ.. సోనూసూద్ వీడియోను పోస్ట్​ చేయడం వెనుక అర్థం ఏంటి? చన్నీని తమ సీఎం అభ్యర్థిగా చెప్పకనే చెబుతోందా?

Channi as CM face for Punjab polls?
పంజాబ్​ కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి చన్నీ

By

Published : Jan 20, 2022, 11:51 AM IST

Punjab Congress CM candidate: అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్​కు అంతో ఇంతో గెలుపు అవకాశాలు ఉన్నది పంజాబ్​లోనే​. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ పార్టీ అధిష్ఠానం. అయితే.. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంకన్నా అంతర్గత పోరే కాంగ్రెస్​కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధాన ప్రతిపక్షం ఆమ్​ ఆద్మీ పార్టీ లాగా సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించి ముందుకెళ్దామంటే.. సీనియర్లు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ అయితే "రానున్న ఎన్నికల్లో పంజాబ్​ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు.. అధిష్ఠానం కాదు" అంటూ ఒక రకంగా హెచ్చరించినట్లు మాట్లాడటం గమనార్హం.

ఇదీ చూడండి:'హైకమాండ్ ఎవరు? సీఎం ఎవరో తేల్చేది ప్రజలే!'

ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్​ నాయకత్వం వెనకడుగు వేస్తోంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్​లో లేదు. అయితే పంజాబ్​ ఎన్నికల విషయంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది.

'పాము చావకుండా.. కర్ర విరగకుండా' అన్న చందంగా పంజాబ్​ కాంగ్రెస్​ సీఎం అభ్యర్థిపై ఎవరనే దానిపై క్లారిటీ పార్టీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అన్ని సామాజిక అంశాలను విశ్లేషించి.. దళిత ఓట బ్యాంకును గంపగుత్తగా ఆకర్షించే వ్యూహంలో భాగంగా సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్​ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనేక ఊహాగానాలకు చెక్​ పెడుతూ.. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే పంజాబ్​ సీఎం​ అభ్యర్థి అని హస్తం పార్టీ చెప్పకనే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది.

చన్నీని హీరో యాంగిల్​లో చూపిస్తూ.. సోనూసూద్ వీడియోను కాంగ్రెస్ తన ట్విటర్​ ఖాతాలో పోస్ట్​ చేయడం.. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. అందులో సోనూ చెప్పిన మాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

"అసలైన ముఖ్యమంత్రి .. తానే సీఎం అని చెప్పరు. ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పనవసరం లేదు. కుర్చీ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. అది నీది అయితే.. అదే నీ వెనుక వస్తుంది. ఆలాంటి ముఖ్యమంత్రే దేశంలో మార్పు తీసుకురాగలరు."

- కాంగ్రెస్​ ట్వీట్​ చేసిన వీడియోలో సోనూసూద్​ మాటలు

ఇటీవల సోనూసూద్​ సోదరి మాళవికా సూద్​ కాంగ్రెస్​లో చేరారు. మోగాలోని సోనూ నివాసంలో పంజాబ్​ పీసీసీ చీఫ్​ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చన్నీ కలిసి పార్టీలోకి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్​ తన అధికారిక ట్విటర్​ ఖాతాలో చన్నీ గురించి సోనూసూద్​ మాట్లాడే వీడియోను పోస్ట్​ చేయడం గమనార్హం.

సోనూ మాట్లాడే వీడియోలో చన్నీ ఉన్నారు కానీ.. పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ ఎక్కాడా కనిపించకపోవడం గమనార్హం.

మాళవిక సూద్‌ను మోగా అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్​ కేటాయించింది.

పంజాబ్ యూత్ కాంగ్రెస్ మరో వీడియో..

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటలకే.. పంజాబ్ యూత్ కాంగ్రెస్ చన్నీ సినిమాటిక్​ యాంగిల్​ చూపిస్తూ.. మరో వీడియోను పోస్ట్​ చేసింది. ' శక్తిమంతమైన వ్యక్తులు శక్తిమంతమైన ప్రదేశాల నుంచి వస్తారని చరిత్ర చెబుతుంది. అయితే అది తప్పు. శక్తిమంతమైన మనుషులు.. వారి ప్రాంతాలను శక్తిమంతం చేస్తారు' అని ఆ వీడియోకు క్యాప్షన్ జోడించింది పంజాబ్ యూత్ కాంగ్రెస్.

అబ్బే.. అలాంటిదేం లేదే...

అయితే, ఉమ్మడి నాయకత్వంతోనే ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు కాంగ్రెస్ చెబుతోంది. చన్నీ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలను ఎదుర్కొంటారని పార్టీ పంజాబ్ వ్యవహారాల బాధ్యులు హరీశ్ చౌదరి తెలిపారు. సిద్ధూ లేవనెత్తే ప్రతి అంశాన్ని పార్టీ తీవ్రంగానే పరిగణిస్తుందని చెప్పారు. 'ప్రస్తుతం చన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే హోదాలో ఎన్నికలకు వెళ్తారు. ముఖ్యమంత్రిగా ప్రచారం నిర్వహిస్తారు. కాంగ్రెస్​లో ముగ్గురు కీలక వ్యక్తులు ఉన్నారు. చన్నీ, సిద్ధూ, సునీల్ జాఖర్. 111 రోజుల్లో చన్నీ ప్రజా సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ప్రస్తుతానికైతే ఉమ్మడి నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది' అని హరీశ్ చౌదరి వివరించారు.

'సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయించేది పార్టీ హైకమాండ్. కానీ, చన్నీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక పంజాబ్​ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు' అని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు.

కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ రాజీనామా తదనంతర నాటకీయ పరిణామాల మధ్య.. ముఖ్యమంత్రిగా చరణ్​జీత్​ సింగ్​ను కాంగ్రెస్​ అధిష్ఠానం ఎంపిక చేసింది.

చన్నీ రాజకీయ ప్రస్థానం..

  • మున్సిపల్​ కౌన్సిలర్​గా ఎన్నికై.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు చన్నీ. వరుసగా మూడు సార్లు విజయం సాధించారు.
  • ఖరార్​ మున్సిపల్​ కౌన్సిల్​కు రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు.
  • 2007లో, ఛంకౌర్​ సాహిబ్​ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్​ అభ్యర్థిపై పోటీ చేశారు చన్నీ.
  • మూడేళ్ల తర్వాత కెప్టెన్​ అమరీందర్​ సింగ్​.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
  • 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.
  • 2016లో కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేతగానూ(సీఎల్​పీ) సేవలందించారు.
  • 2015లో పీపీసీసీ అధ్యక్షుడు ప్రతాప్​ సింగ్​ బజ్వాను తొలగించాలని కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ తిరుగుబాటు చేసినప్పటికీ.. చన్నీ ఆయనతో వెళ్లకుండా తటస్థంగా ఉండిపోయారు. ఈ కారణంగానే 14వ శాసనసభకు ప్రతిపక్ష నేతగా చన్నీని ఎంపిక చేసింది కాంగ్రెస్​ అధిష్ఠానం.
  • 2017లో అమరీందర్​ ప్రభుత్వంలో.. సాంకేతిక విద్య, ఇండస్ట్రియల్​ ట్రైనింగ్​, ఉపాధి కల్పన, సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖల మంత్రిగా సేవలందించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details