జేఈఈ మెయిన్స్-2021 పరీక్షల నాలుగో ఎడిషన్ తేదీలో మార్పులు చేసింది కేంద్ర విద్యాశాఖ. మూడు, నాలుగు ఎడిషన్ల మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండేలా చూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీని ప్రకారం నాలుగో ఎడిషన్‌ను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో నిర్వహించనున్నారు.
"విద్యార్థుల డిమాండ్‌తో పాటు.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వారికి తగినంత సమయం ఉండేదుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం."