COMPENSATION FOR DOG DEATH: సుమారు 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయస్థానంలో విజయం సాధించాడు ఓ వ్యక్తి. ఓ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్న కుక్క... రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల దాని నుంచి వచ్చే ఆదాయాన్ని అతడు కోల్పోయాడు. దీంతో శునకం మరణానికి కారణం అయిన వారిపై కేసు పెట్టి కోర్టుకు వెళ్లాడు. సుమారు 8 ఏళ్ల 11 నెలల తరువాత పరిహారం పొందాడు.
అసలు ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని చంద్రాపుర్కు చెందిన ఉమేశ్ భత్కార్‌కు ఓ కుక్క ఉంది. దాని పేరు జాన్. ఆ శునకం ఓ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేసేది. దీని ద్వారా యజమానికి నెలకు రూ. 8 వేలు వచ్చేవి. ఓ రోజు ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తుంటే స్థానికంగా ఉండే ఓ స్కూల్ బస్ ఆ శునకాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జాన్ అక్కడికక్కడే మరణించింది.