తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chandrababu expressed doubts about security in jail: జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. - చంద్రబాబు జైలు వీడియోలు

Chandrababu expressed doubts about security in jail: రాజమండ్రి జైల్లో తన భద్రతపై అనుమానాలున్నాయని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందించారు. పూర్తి వివరాలను రాసి... సీల్డ్‌ కవర్‌లో జైలు అధికారులకు అందజేయాలని చంద్రబాబుకు సూచించారు. దాన్ని వారు కోర్టుకు పంపుతారని.. న్యాయమూర్తి చంద్రబాబుకు తెలిపారు.

Chandrababu expressed doubts about security in jail
Chandrababu expressed doubts about security in jail

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 8:26 AM IST

Chandrababu expressed doubts about security in jail: జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు..

Chandrababu expressed doubts about security in jail: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై గత నలబై రోజులుగా రాజమండ్రి జైల్లో విచాణను ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కస్టడి గడువు ముగియడంతో... నిన్న ఆన్‌లైన్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు ముదు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భద్రతపై అనుమానాలున్నాయని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట నారా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను రాసి... సీల్డ్‌ కవర్‌లో జైలు అధికారులకు అందజేయాలని... దాన్ని వారు కోర్టుకు పంపుతారని.. న్యాయాధికారి చంద్రబాబుకు తెలిపారు.

వైద్య నివేదికలను కోర్టుకు పంపుతున్నారు: నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడిషియల్‌ రిమాండు గడువు ముగియడంతో రాజమహేంద్రవరం జైలు అధికారులు ఆయనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును న్యాయధికారి ప్రశ్నించారు. తనకు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాబు బదులిచ్చారు. వైద్య నివేదికలను కోర్టుకు పంపుతున్నారని.... వాటిని తాను చూస్తున్నానని న్యాయాధికారి తెలిపారు. ఆ నివేదికలను మీకు అందజేస్తున్నారా అని ఆరా తీశారు. వైద్య నివేదికలను తనకు ఇస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పరీక్షించిన వైద్యులు పక్కన ఉన్నారా అని న్యాయాధికారి ప్రశ్నించగా... వారు ఆన్‌లైన్‌లోకి వచ్చి, గురువారం ఉదయం చంద్రబాబును పరీక్షించినట్లు తెలిపారు.

Chandrababu skill development case: వెకేషన్​ బెంచ్​ ముందుకు బాబు బెయిల్​ పిటిషన్​

సీల్డ్‌ కవర్​లో వివరాలు: చంద్రబాబు వ్యాజ్యాలు సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని.... ఈ నేపథ్యంలో ఇంతకుమించి మాట్లాడలేనని న్యాయాధికారి ముగించబోతుండగా... చంద్రబాబు తన విన్నపాన్ని వినాలని కోరారు. తాను జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన వ్యక్తినని.... జైల్లో, బయట తన భద్రతపై అనుమానాలున్నాయన్నారు. ఆందోళన, సమస్యలపై పూర్తి వివరాలను సీల్డ్‌ కవర్​లో జైలు అధికారులకు ఇవ్వాలని న్యాయాధికారి సూచించారు. ఆ కవర్‌ తమకు పంపాలని జైలు అధికారులను ఆదేశించారు. జ్యుడిషియల్‌ రిమాండును నవంబరు 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

TDP Leaders Protest In West Godavari : 'పశ్చిమ'లో టీడీపీ నేతల నిరసన... 'గడప గడపకు బాబుతో నేను'

వైద్య నివేదికలను జైలు అధికారులు ఇవ్వట్లేదుచంద్రబాబును ఆన్‌లైన్‌ ద్వారా న్యాయాధికారి విచారిస్తున్న సమయంలో వైద్య నివేదికలను కోరితే జైలు అధికారులు ఇవ్వట్లేదని ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. సీఐడీ తరఫు న్యాయవాదులకు అవి ఎలా వెళుతున్నాయన్నారు. సీఐడీ పీపీ దాఖలు చేసిన కౌంటర్‌లో 14వ తేదీనాటి వైద్య నివేదికను జతచేసినట్లు తెలిపారు. జైలు అధికారులు నివేదికను తనకే పంపుతున్నారన్నారని న్యాయాధికారి తెలిపారు..నివేదికలను కుటుంబసభ్యులకు ఇచ్చి వారినుంచి ఎక్నాలడ్జ్‌మెంట్‌ తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Chandrababu Bail Petition Transferred to Vacation Bench: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ వెకేషన్ బెంచ్‌కు బదిలీ

ABOUT THE AUTHOR

...view details