Chandrababu Bail Petition Hearing Adjourned: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఈనెల 19 లోపు కౌంటర్ దాఖలు చేయాలని.. సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. అంతకముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు వినాలని ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినాలన్నారు.
అదే సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న వాదనలకు సీఐడీ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కౌంటర్ దాఖలుకు సీఐడీ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్ పిటిషన్‌పై ప్రభావం పడుతుందన్నారు. కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉందన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్‌నూ ఈనెల 19నే విచారిస్తామన్నారు.
AP HC adjourned Chandrababu Quash petition Hearing : అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌ను విచారించొద్దు.. ఏసీబీ కోర్టుకు ఆదేశం
ఏపీ స్టేట్ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని.. ఈ ఆరోపణలతో సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఆ ఆరోపణలలో తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసినట్లు పిటిషన్‌లో న్యాయస్థానానికి వివరించారు.
Twitter Posts on Chandrababu Naidu Arrest : ఈ అరాచకాలు.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.. మౌనం వెనక ప్రళయం ఉంది.. గుర్తుపెట్టుకో జగన్
ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేదని చంద్రబాబు వివరించారు. ఈ కేసులో తన పేరు ఎప్పుడు చేర్చారో కూడా చెప్పలేదని.. ఏ ఆధారాలతో తనను నిందితుడిగా చేర్చారో చెప్పడానికి సీఐడీ దగ్గర ప్రాథమిక వివరాలు లేవని పేర్కొన్నారు. రాజకీయ ప్రతీకారంతోనే దురుద్దేశపూర్వకంగా ఈ కేసులోకి లాగినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఇరికించారని.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చేలోపు.. మధ్యంతర బెయిలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం.. 'స్కిల్' ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదు: డిజైన్‌టెక్ ఎండీ వికాస్‌ఖాన్ విల్కర్